పెళ్లి చేసుకుంటా, ఓ అమ్మాయిని వెతికిపెట్టండి.. అధికారులకు రాజస్థానీ లేఖ
- తననో ఇంటి వాడిని చేయాలంటూ వేడుకోలు
- ఫలానా లక్షణాలు ఉండాల్సిందేనని షరతు
- సీఎం సహాయక శిబిరానికి చేరిన లెటర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేఖ ఫొటో
రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయక శిబిరానికి ఇటీవల మహావీర్ అనే వ్యక్తి లేఖ రాశాడు. తనకు 40 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని అందులో పేర్కొన్నాడు. తనకో అమ్మాయిని వెతికిపెడితే పెళ్లి చేసుకుని స్థిరపడతానని కోరాడు. అంతేకాదు, తనకు భార్యగా రాబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలనూ మహావీర్ అందులో పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించాలని వినతి చేశాడు.
కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవేనట..
* అమ్మాయి తప్పనిసరిగా సన్నగా ఉండాలి.
* నాయకత్వ లక్షణాలు ఉండాలి.
* న్యాయంగా వ్యవహరించడంతో పాటు అమ్మాయి వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.