Vladimir Putin: టూ.. మచ్! భద్రత కోసం ఐదు నెలల్లో 186 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన పుతిన్

  • తన భద్రత కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న పుతిన్
  • మిలిటరీ, సరిహద్దు భద్రత కోసం చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువే
  • వార్షిక బడ్జెట్‌లో 77 శాతం పుతిన్ భద్రతకే
Russian president spending too much on his security

ఉక్రెయిన్‌తో యద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన భద్రత కోసం మిలియన్ల డాలర్లలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. గత ఐదు నెలల్లోనే ఏకంగా 186 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగుతున్న నేపథ్యంలో పుతిన్ తన భద్రత కోసం భారీగా ఖర్చు చేస్తుండడం గమనార్హం. 

ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు పుతిన్, తన సెక్యూరిటీ సిబ్బంది కోసం 15 బిలియన్ రూబెల్స్ (185,700 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసినట్టు రష్యా ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది వార్షిక బడ్జెట్‌లో 77 శాతమని పేర్కొంది. గతేడాది ఇదే కాల వ్యవధిలో చేసిన ఖర్చుతో పోలిస్తే 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం. రష్యా మిలిటరీ, సరిహద్దు భద్రత కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్నదానికంటే ఇది చాలా ఎక్కువ. 

మే 3న మాస్కోలోని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు కూలాయి. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగుతోందని, అది ప్రయోగించిన 8 డ్రోన్లు స్వల్ప నష్టాన్ని కలిగించాయని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ భద్రతను పెంపు చేస్తూ మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.

More Telugu News