శరత్ బాబు మృతిపై ఆయన తొలి భార్య రమాప్రభ స్పందన

ప్రముఖ సీనియర్ సినీ నటుడు శరత్ బాబు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలు చెన్నైలో జరిగాయి. మరోవైపు ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్న సంగతి తెలిసిందే. తొలి భార్య ప్రముఖ సినీ నటి రమాప్రభ. మనస్పర్థల కారణంగా ఇద్దరు భార్యలకు ఆయన విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన ఒంటరి జీవితాన్ని గడిపారు. 

మరోవైపు శరత్ బాబు మరణంపై రమాప్రభ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. శరత్ బాబు మరణం తర్వాత తాను ప్రశాంతంగా కనిపిస్తూ ఉండొచ్చని... కానీ, శాస్త్ర ప్రకారం అన్ని కార్యక్రమాలను చేసుకుంటున్నానని ఆమె చెప్పారు. హైందవ ధర్మాచారం ప్రకారం అన్నీ పాటిస్తున్నానని తెలిపారు. సినిమాలలో శరత్ బాబుకు గొప్ప స్థాయి రావడానికి తానే కారణమని... దీన్ని మర్చిపోయి కొందరు తన గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Ramaprabha
Sarath Babu
Tollywood

More Telugu News