రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు కంపెనీల కొత్త ఎత్తు.. చిరుద్యోగులకు పెద్ద నోటుతో వేతనాల చెల్లింపు
- ఒకటో తేదీనే వేతనాలు చెల్లించిన కంపెనీలు
- రెట్టింపు వేతనమిచ్చి నోట్లు మార్చి తీసుకురావాలని హుకూం
- జూన్ 1న చేతులు మారిన కోట్లాది రూపాయలు
కొన్ని కంపెనీలు ఇంకొక అడుగు ముందుకు వేసి చిరుద్యోగుల వేతనాలకు రెట్టింపు వేతనం చెల్లించాయి. ఇదేంటని ఉద్యోగులు ఆశ్చర్యపోయేలోపే మిగతా నోట్లను మార్చుకుని తీసుకురావాలంటూ ఆదేశించాయి. ఉదాహరణకు రూ.10 వేలు వేతనం అందుకునే ఉద్యోగికి రూ.20 వేల విలువైన 2 వేల నోట్లు చేతిలో పెట్టి మిగతా పదివేలకు చిల్లర తీసుకురమ్మని హుకూం జారీ చేశాయి. ఈ విధంగా జూన్ 1న హైదరాబాద్ లో కోట్లాది రూపాయల విలువైన రూ.2 వేల నోట్లు చేతులు మారినట్లు సమాచారం.