వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
  • ఉదయం నుంచి ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
  • 193 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు కోల్పోయి 62,428కి పడిపోయింది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 18,487 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.67%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.39%), ఏసియన్ పెయింట్స్ (1.32%), సన్ ఫార్మా (1.12%), టీసీఎస్ (0.98%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.42%), కోటక్ బ్యాంక్ (3.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.31%), ఐటీసీ (1.24%), రిలయన్స్ (0.51%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News