షాకింగ్.. తమ్ముడిని గొంతు నులిమి చంపేసిన మైనర్ బాలిక!
- హరియాణాలో వెలుగు చూసిన ఘటన
- తమ కుమారుడికి ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులు
- అతడు ఫోన్‌లో ఆడుకుంటుండగా తనకోసారి ఫోన్ ఇవ్వమన్న అక్క
- అతడు కుదరదని అనడంతో గొంతు నులిమి హత్య
- తల్లిదండ్రులకు తన తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని బాలిక భావించినట్టు చెప్పిన పోలీసులు
ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు తన ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది. అతడు కుదరదని అనడంతో ఆమె తన తమ్ముడి గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు, నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి నిర్ఘాంతపోయారు. కూతురిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.