మరోసారి తాత అయిన ముఖేశ్ అంబానీ

Mukesh Ambani becomes grand father once again
  • పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆకాశ్ భార్య శ్లోక
  • శుభాకాంక్షలు తెలిపిన పరిమళ్ నత్వానీ
  • సిద్ధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ముఖేశ్ అంబానీ, కుటుంబ సభ్యులు
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వారికి ఇది రెండో సంతానం. 2020 డిసెంబర్ లో శ్లోక కుమారుడికి జన్మనిచ్చారు. శ్లోకకు అమ్మాయి పుట్టినట్టు ముఖేశ్ అంబానీ సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. 

చిన్ని రాకుమారి ఇంట్లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆకాశ్, శ్లోకలకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చెప్పారు. మరోవైపు తమకు మనవరాలు పుట్టిన సందర్భంగా ముఖేశ్ అంబానీ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Go Back to Shorts
Mukesh Ambani
Grand Father
Akash Ambani

More Telugu News