ధోనీ అందరి వాడు..! గుజరాత్ టైటాన్స్ బౌలర్ కు ఓదార్పు!
- చివరి ఓవర్ బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ
- చెన్నై గెలుపుతో తీవ్ర నిరాశ చెందిన గుజరాత్ బౌలర్
- దగ్గరకు తీసుకుని ఓదార్చిన ధోనీ
ధోనీ అందరినీ కలుపుకుని పోయే స్వభావానికి నిదర్శనంగా ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత కనిపించిన ఓ దృశ్యాన్ని చెప్పుకోవచ్చు. గుజరాత్ జట్టు తరఫున చివరి ఓవర్ ను మోహిత్ శర్మ వేశాడు. మొదటి నాలుగు బంతులను అతడు గొప్పగానే యార్కర్లుగా వేశాడు. దీంతో చెన్నై బ్యాటర్లు జడేజా, దూబే కేవలం మూడు పరుగులే రాబట్టారు. ఇక చివరి రెండు బంతులను జడేజా సిక్సర్, బౌండరీగా మార్చడంతో చెన్నై విజయం ఖాయమైంది. తన బౌలింగ్ వల్లే గుజరాత్ ఓటమి పాలైందన్న నిరాశతో ఉన్న మోహిత్ శర్మను ధోనీ దగ్గరకు తీసుకుని ఓదార్చుతున్నట్టు తలను నిమిరాడు.