తీహార్ జైలులో పెట్టినా సరే పోటీ చేస్తా.. గెలుస్తా: భూమా అఖిలప్రియ
- ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ
- ఎక్కడున్నా సరే ఆళ్లగడ్డ ప్రజలకు అండగా ఉంటానని వెల్లడి
- పార్టీలోని గుంటనక్కల సంగతి నారా లోకేశ్ చూసుకుంటారన్న అఖిలప్రియ
అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. ఏవీ సుబ్బారెడ్డి నిజంగానే పార్టీలో ఉంటే ఈ నాలుగేళ్లు ఏంచేశారో చెప్పాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. పార్టీలోని గుంటనక్కల సంగతి నారా లోకేశ్ చూసుకుంటారని చెప్పారు. కాగా, టీడీపీలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పొడసూపిన విభేదాలు ఇటీవల మరింత ముదిరాయి. కొత్తపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఎదురుగానే ఇరువర్గాలు గొడవపడ్డాయి. అఖిలప్రియ మద్దతుదారుడు దాడి చేయడంతో సుబ్బారెడ్డి ముక్కు నుంచి రక్తం కారింది. దీనిపై ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేశారు.