ఎల్బీనగర్ అగ్ని ప్రమాదంలో 3 కోట్ల నష్టం.. ఏడుస్తూ సొమ్మసిల్లిపడిపోయిన యజమాని
- సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం
- కాలిబూడిదైన 20 కార్లు
- మరో నాలుగు కార్లను జాగ్రత్తగా బయటకు తీసిన పోలీసులు
- బూడిదైన కార్లను చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన యజమాని
దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం నుంచి నాలుగు కార్లను బయటకు తీయగలిగామని, మిగతావి అగ్నికి ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. కాగా, కార్లు కాలిపోవడంతో దాదాపు రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన కార్ల గ్యారేజీ యజమాని విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని చూసి లబోదిబోమన్నారు. ఏడుస్తూ సొమ్మసిల్లిపడిపోయారు.