Nara Lokesh: ​పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ దుకాణం బంద్: నారా లోకేశ్

  • మళ్లీ మొదలైన నారా లోకేశ్ యువగళం
  • జమ్మలమడుగు సెంటర్ లో భారీ సభ
  • పోటెత్తిన జనాలు
  • ప్రజల కన్నీళ్లు తుడవడానికే భవిష్యత్తుకు గ్యారంటీ ప్రకటన
  • మినీ మేనిఫెస్టోతోనే ప్రకంపనలు వస్తున్నాయన్న లోకేశ్
Nara Lokesh says complete manifesto can shut YCP

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా జమ్మలమడుగు జనసంద్రంగా మారింది. 111వ రోజు యువగళం పాదయాత్ర జమ్మలమడుగు శివారు బైపాస్ రోడ్డు నుంచి సాయంత్రం ప్రారంభమైంది. కనీవినీ ఎరుగని విధంగా జనం లోకేశ్ ను చూసేందుకు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. 

జమ్మలమడుగు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు పెద్దఎత్తున జనం హాజరుకావడంతో నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జమ్మలమడుగు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెదపసుపుల మోటు, సంజాముల మోటు, జమ్మలమడుగు పాతబస్టాండు, కన్నెలూరు క్రాస్, శేషారెడ్డిపల్లి మీదుగా దేవగుడి చేరుకుంది. 

కన్నీళ్లు తుడవడానికే భవిష్యత్తుకు గ్యారంటీ!

యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాను... నేను చూసిన ప్రజల కష్టాలను చంద్రన్న దృష్టికి తీసుకెళ్లాను, మీరు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని మహానాడులో భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో మన చంద్రన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు అని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. జమ్మలమడుగులో నిర్వహించిన భారీ బహిరంగసభలో యువనేత లోకేశ్ ప్రసంగించారు. 

"మహానాడు మినీ మేనిఫెస్టోకే వైసీపీ నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు. ఇక పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ దుకాణం బంద్. హామీలు అన్ని ఎలా అమలు చేస్తారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు, పేటీఎం డాగ్స్ అన్ని రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నాయి. జగన్ అప్పుల అప్పారావు... మా చంద్రన్న సంపద సృష్టికర్త. జగన్ ది దొబ్బే గుణం... చంద్రన్న ది పెట్టే గుణం. జగన్ మోసగాడు... చంద్రన్న మొనగాడు. అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలుచేసి తీరుతారు. మీ కష్టాలు తెలుసుకున్న తరువాత మీ అన్న చంద్రన్న మహాశక్తి పథకం కింద పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు" అని వెల్లడించారు. 

జమ్మలమడుగు అదిరిపోయింది!

జమ్మలమడుగు జోష్ అదిరిపోయింది. లోకేశ్... భూపేశ్ జోడీ అదిరిపోయింది కదూ. పెన్నా నది నీళ్లలోని పౌరుషం జమ్మలమడుగు ప్రజల్లో ఉంటుంది. నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం, అంబా భవాని దేవాలయం ఉన్న పుణ్యభూమి జమ్మలమడుగు. ఘనచరిత్ర ఉన్న గండికోటని ఎవడూ టచ్ చెయ్యలేకపోయాడు, అలాగే జమ్మలమడుగు ప్రజల్ని టచ్ చేసే దమ్ము కూడా ఎవడికి లేదు. 

ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్రపడిన జమ్మలమడుగులో స్వాతంత్య్ర సమరయోధుడు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించారు. చేనేత వర్గానికి చెందిన కుండా రామయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మూడు నదులు, మూడు జిల్లాలకు సెంటర్ జమ్మలమడుగు. దమ్మున్న నేల జమ్మలమడుగులో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

సుధీర్ రెడ్డి సూట్ కేసు కథే వేరు!

2019 ఎన్నికల్లో జమ్మలమడుగు జాతకం మార్చేస్తాడు అని భారీ మెజారిటీతో మూలె సుధీర్ రెడ్డి గారిని గెలిపించారు. సుధీర్ రెడ్డి గారి జాతకం మారింది కానీ జమ్మలమడుగు జాతకం మారలేదు. సుధీర్ రెడ్డి ఉదయం రెండు సూట్ కేసులతో బయటకి వెళతాడు. ఒకటి ఖాళీ సూట్ కేసు, రెండోది బీర్ కేసు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి బీర్ కేసు ఖాళీ అవుతుంది, సూట్ కేసు ఫుల్ అవుతుంది. 

ఎన్నికల ముందు వేసుకున్న చొక్కా, బనియన్ నాది కాదు, నేను ఒక చిన్న డాక్టర్ ని అని చెప్పిన సుధీర్ రెడ్డి మాట మార్చాడు. ఇప్పుడు మాది జమిందారీ కుటుంబం అంటున్నాడు. ఇన్ని కోట్ల ఆస్తి సడన్ గా ఎలా వచ్చింది?

బాబాయ్ మర్డర్ కేసులో నిందితులకు డబ్బులు ఇవ్వడం దగ్గర నుండి ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, పరిశ్రమల నుండి నెలనెలా కమీషన్, వెంచర్లు వేసే వారి దగ్గర కమీషన్లు, ఉద్యోగస్తుల ట్రాన్సఫర్లలో కమీషన్, ఆఖరికి చీప్ గా చికెన్ షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర కూడా కమీషన్లు. సుధీర్ రెడ్డి చరిత్ర తెలుసుకున్న తరువాత ఆయన పేరు మార్చాను. ఆయన డాక్టర్ సుధీర్ రెడ్డి కాదు యాక్టర్ సుధీర్ రెడ్డి.

యాక్టర్ సుధీర్ రెడ్డి వసూళ్ల పర్వం

యాక్టర్ సుధీర్ రెడ్డి ఎన్నికల్లో అయిన ఖర్చు మొదటి నెలలోనే నియోజకవర్గంలో ఉన్న సిమెంట్, సోలార్ కంపెనీల నుండి వసూలు చేశాడు. మున్సిపల్ వర్క్స్ అన్ని యాక్టర్ సుధీర్ తన బినామీలకు ఇప్పించుకొని భారీగా ప్రజాధనం లూటీ చేస్తున్నాడు. 

నియోజకవర్గంలోని క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల నుండి ప్రతి నెలా కప్పం కట్టించుకుంటున్నాడు. మైలవరం మండలంలోని సోలార్ పార్క్ యాజమాన్యాన్ని బెదిరించి కమీషన్ వసూలు చేస్తున్నాడు. అంగన్వాడి పోస్టులు కూడా అమ్ముకున్నాడు. యాక్టర్ సుధీర్ రెడ్డి దోపిడీ డిఫరెంట్... ఏకంగా లంచాన్ని అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేయించుకున్న ఘనుడు. 

యాక్టర్ సుధీర్ రెడ్డి దోపిడీకి భయపడి స్ప్రింగ్ ఎనర్జీ కంపెనీ, అయానా కంపెనీ, సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ, గండికోట అడిషనల్ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మించే కంపెనీ పారిపోయాయి. గండికోట టూరిజం రోప్ వే ప్రాజెక్ట్ ఏర్పాటు చెయ్యాల్సిన కంపెనీ పారిపోయింది. యాక్టర్ సుధీర్ రెడ్డి ఎంత కక్కుర్తి వాడంటే ఆఖరికి ట్రాన్స్ పోర్ట్ కి వాడే టిప్పర్లు కూడా ఆయనవే ఉపయోగించాలంట. 

పేదలు, అనాథల కోసం ఏర్పాటు చేసిన నైట్ సెంటర్ ఆశ్రమంలో ఒక్కరికి కూడా భోజనం పెట్టకుండా లక్షల్లో బిల్లులు డ్రా చేసుకుంటున్నారు యాక్టర్ సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు. నియోజకవర్గంలో మట్కా, క్రికెట్ బెట్టింగ్ నడిపిస్తుంది ఎవరు? యాక్టర్ సుధీర్ రెడ్డి అనుచరులు. బాబాయ్ హత్య కేసులో నిందితులకు డబ్బులు, షెల్టర్ యాక్టర్ సుధీర్ రెడ్డి ఇచ్చినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.

*నారా లోకేశ్  యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1435.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.1 కి.మీ.*

*112వరోజు పాదయాత్ర వివరాలు (31-5-2023)*

*జమ్మలమడుగు/ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు (కడప జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద క్యాంప్ సైట్ లో పద్మశాలి సామాజికవర్గీయులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 - దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.05 – సలివెందులలో స్థానికులతో సమావేశం.

4.15 – దేవగుడి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

5.00 – పొద్దుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశం, చౌడూరులో మాటామంతీ.

5.15 – చౌడూరులో రైతులతో సమావేశం.

6.00 – శంకరాపురంలో పద్మశాలి సామాజికవర్గీయులతో భేటీ.

6.30 – పెద్దశెట్టిపల్లి గౌతమ్ ఇంజనీరింగ్ కాలేజి వద్ద స్థానికులతో సమావేశం.

6.35 – పెద్దశెట్టిపల్లి బస్ షెల్టర్ వద్ద రైతులతో సమావేశం.

6.50 – నరసింహాపురంలో ఎంఆర్ పిఎస్ నాయకులతో సమావేశం.

7.20 – చౌటపల్లి బాక్స్ క్రికెట్ ప్రాంగణం వద్ద విడిది కేంద్రంలో బస.

******


More Telugu News