కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్... ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్
- వివిధ మఠాధిపతులతో పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ ఫోటో
- ట్విట్టర్ వేదికగా ప్రధానికి చురకలు అంటించిన మమత
- స్వాతంత్య్రం వచ్చాక... ఇప్పుడు అంటూ నెహ్రూ, మోదీ ఫోటోలతో ట్వీట్
మమత ఈ చిత్రాన్ని భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో లింక్ చేశారు. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, బిఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ఉన్న ఫోటోను, మోదీ, మఠాధిపతులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు అంటూ రెండు ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు.