రెడ్ శారీలో మెరిసిపోతున్న రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఫొటోలు వైరల్
- తొలి త్రైమాసిక గర్భం ఫొటోలను షేర్ చేసిన ఉపాసన
- బేబీ బంప్ తో ఉన్న చరణ్ అర్ధాంగి
- శారీని డిజైన్ చేసిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా
ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. తన సీమంతం ఫొటోలు, బేబీ బంప్ పిక్స్ ను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాజాగా ఆమె తన తొలి త్రైమాసిక గర్భానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలలో రెడ్ కలర్ శారీలో ఆమె మెరిసిపోతున్నారు. ఈ చిత్రాల్లో ఆమె బేబీ బంప్ ను కూడా చూడొచ్చు. ఈ శారీని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

