రెండున్నర గంటల్లోనే 500 కిలోమీటర్లు కవర్ చేశా.. తమిళనాడు సీఎం ట్వీట్ వైరల్
- తమిళనాడు సీఎం సింగపూర్, జపాన్ పర్యటన
- రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు టూర్
- టూర్‌లో భాగంగా ఆదివారం సీఎం బుల్లెట్ రైలు ప్రయాణం
- రెండున్నర గంటల్లోపే 500 కిలోమీటర్లు ప్రయాణించానంటూ ట్వీట్
‘‘ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్ రైలులో ప్రయాణం చేశా. దాదాపు రెండున్నర గంటల్లోపే 500 కిలోమీటర్ల మేర ప్రయాణించా’’ అంటూ ఆయన తన జర్నీ ఫొటోలు, విశేషాలు షేర్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు స్టాలిన్.. సింగపూర్, జపాన్ నగరాల్లో పర్యటిస్తున్నారు. బుల్లెట్ రైలు వేగం, నాణ్యతతో కూడిన ప్రయాణ సదుపాయాలు భారత్‌లోనూ రావాలని అభిప్రాయపడ్డారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటూ వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షించారు. #futureindia హ్యాష్‌ట్యాగ్‌తో ఈ మేరకు ట్వీట్ చేశారు.