‘చదువుల్రావు’ సృష్టికర్త.. సీనియర్ కార్టూనిస్ట్ సత్యమూర్తి కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యమూర్తి
- 1982లో ఉగాది పురస్కారంతో సత్కరించిన ఏపీ ప్రభుత్వం
- బీవీ పట్టాభిరామ్‌కు సత్యమూర్తి స్వయాన అన్నయ్య
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌కు సత్యమూర్తి స్వయాన అన్నయ్య. ఆయన గీసిన వ్యంగ్య కార్టూన్లు ఆంధ్రపత్రిక ముఖచిత్రంగా ప్రచురించింది. సత్యమూర్తి ప్రతిభను గుర్తించిన అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1982లో ఉగాది పురస్కారంతో సత్కరించింది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ, ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ తదితర సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు. సత్యమూర్తికి భార్య జోగేశ్వరి, కుమార్తె ప్రొఫెసర్ పద్మావతి ఉన్నారు. కుమారుడు సాయిభాస్కర్ ఇటీవలే మృతి చెందారు.