తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు
- బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో తలసాని సమీక్ష
- ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్ల ఖర్చు
- 26 ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు జరుగుతాయని తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు.
గోల్కొండలోని శ్రీజగదాంబిక, సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి, పాతబస్తీలోని శ్రీ అక్కన్నమాదన్న ఆలయాలతోపాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వివరించారు.