నటి డింపుల్ హయతి ఇంట్లోకి ఇద్దరు యువతీయువకులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాజమండ్రి నుంచి వచ్చిన యువతీ యువకులు
- కొప్పిశెట్టి సాయిబాబు, శ్రుతిగా గుర్తింపు
- డింపుల్ చెప్పడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు
విషయం తెలిసిన నటి వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని పేర్కొన్నారు. వారిని కొప్పిశెట్టి సాయిబాబు, ఆయన బంధువు శ్రుతిగా గుర్తించారు. ఇటీవల ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు, డింపుల్‌కు మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో కలవడానికి వచ్చినట్టు చెప్పారు. విషయాన్ని డింపుల్‌కు చెప్పడంతో వారిని విడిచిపెట్టమని చెప్పడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.