రూ. 75 నాణాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. కారణం ఇదే!
- ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్న మోదీ
- దీనికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల
- పార్లమెంటు కాంప్లెక్స్, కొత్త పార్లమెంటు భవనం ముద్రణ
పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 25 పార్టీలు హాజరవుతుండగా, ప్రధాని ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాయి.