ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని శరత్ బాబు నాకు చెప్పేవాడు: రజనీకాంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని శరత్ బాబు నాకు చెప్పేవాడు: రజనీకాంత్

Rajinikanth pays tributes to Sharath Babu
  • కాసేపట్లో శరత్ బాబు అంత్యక్రియలు
  • శరత్ బాబుకు పుష్పాంజలి ఘటించిన రజనీకాంత్
  • ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన
సీనియర్ సినీనటుడు శరత్ బాబు అంత్యక్రియలు కాసేపట్లో చెన్నైలో జరగబోతున్నాయి. చెన్నైలోని టీనగర్ లో ఉన్న శరత్ బాబు నివాసం వద్ద ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాసేపటి క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ శరత్ బాబు నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శరత్ బాబు తనకు అత్యంత సన్నిహితుడని, ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని చెప్పారు. నటుడు కాకముందు నుంచి ఆయనతో తనకు పరిచయం ఉందని... తనపట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని తెలిపారు. 

శరత్ బాబు మృతి తనను కలచివేసిందని రజనీ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండేవారని, ఆయన కోపంగా ఉండటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని తనను ఎన్నోసార్లు వారించాడని తెలిపారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Rajinikanth
Sharath Babu

More Telugu News