ట్రక్ డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఏం చేశారంటే..!
- రాత్రిపూట ట్రక్కులో ప్రయాణించిన రాహుల్
- ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళుతుండగా అంబాలా దగ్గర ఆగిన కాంగ్రెస్ మాజీ చీఫ్
- ట్రక్ డ్రైవర్లతో మాటామంతీ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రక్ డ్రైవర్లు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ ఇలా ప్రయాణం చేశారని వారు చెబుతున్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఇలాంటి పనిచేయగలరని, పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన తపన పడుతుంటారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వ్యాఖ్యానించారు. కాగా, షిమ్లాలో ఉంటున్న తన సోదరి ప్రియాంక గాంధీ కుటుంబాన్ని కలుసుకునేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయాణం పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.