లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధమే.. కానీ వాళ్లిద్దరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి: ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధమే.. కానీ వాళ్లిద్దరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి: ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్

Iam ready for lie detector test says Brij Bhushan
  • బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు
  • తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్న బ్రిజ్ భూషణ్
  • వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియాలు కూడా లైడిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలన్న బ్రిజ్ భూషణ్
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహిళా రెజ్లర్లపై ఆయన వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు ధర్నా కూడా చేశారు. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాను ఎలాంటి తప్పు చేయలేదని బ్రిజ్ భూషణ్ అన్నారు. నార్కోటెస్ట్ కానీ, పాలీగ్రాఫ్ టెస్ట్ కానీ, లైడిటెక్టర్ టెస్ట్ కానీ ఏ టెస్టుకైనా తాను సిద్ధమేనని చెప్పారు. అయితే తనతో పాటు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియాలు కూడా టెస్ట్ చేయించుకోవాలని కండిషన్ పెట్టారు. టెస్ట్ చేయించుకోవడానికి వాళ్లిద్దరూ సిద్ధమైతే మీడియా ముఖంగా ఆ విషయాన్ని వెల్లడించాలని, అప్పుడు తాను కూడా టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు. మరోవైపు రెజ్లర్లకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. హర్యానా రైతులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించారు.
Advertisement
Brij Bhushan
Sexual Harassment
Wrestlers
Vinesh Phoat
Bajrang Punia
Lie detector test

More Telugu News