మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం!

  • ఇటీవలే పార్టీలో చేరిన అభ్యర్థి
  • అంబేలోహల్ పంచాయతీ వార్డు సభ్యుడిగా విజయం
  • తెలంగాణకు ఆవల తొలి గెలుపు
తెలంగాణకు ఆవల బీఆర్ఎస్ తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. 

ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఉప ఎన్నిక జరగ్గా నిన్న ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

BRS
Telangana
Maharashtra

More Telugu News