జూన్ 8 నుంచి 10 వరకు తెలంగాణలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్
- తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్
- అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ
- 20 నుంచి 40 వరకు స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి తలసాని
ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణపై సచివాలయంలో మంత్రి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. స్వయం ఉపాధి కోసం మత్స్యకార మహిళలకు చేపలతో వివిధ రకాల వంటకాలపై శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఈ ఫెస్టివల్‌లో 20 నుంచి 40 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అలాగే, మత్స్య రంగానికి సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించనున్నట్టు మంత్రి తెలిపారు.