బలగం మొగిలయ్యకు దళిత బంధు

'బలగం' మొగిలయ్యకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేశారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బలగం సినిమాలో పాటలు పాడిన మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు కారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, కేసీఆర్ ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా ద‌ళితుల‌కు అండ‌గా ఉంటుంద‌ని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు.

మూడేళ్లలో దళితులందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించారు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. వీరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి కారును అందించారు.


More Telugu News