ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించిన టీఎస్ఆర్టీసీ
- నెల రోజుల పాటు ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటన
- మియాపూర్ నుండి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.760కి తగ్గింపు
- ఎంజీబీఎస్ నుండి విజయవాడ ఛార్జీ రూ.720కి తగ్గింపు
మియాపూర్ నుండి విజయవాడకు బస్సు ఛార్జీని రూ.830గా నిర్ణయించారు. ఈ ధరను ఇప్పుడు రూ.760కి తగ్గించారు. ఎంజీబీఎస్ నుండి విజయవాడకు రూ.780గా ఉన్న టిక్కెట్ ధరను రూ.720కి తగ్గించారు. నిన్న పది ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సులను ప్రారంభించారు. దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి 50 బస్సులను ప్రారంభించనుంది.