కొడాలి నాని వంటి వారిని జైలుకు పంపిస్తాం!: ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్

  • గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశం చేస్తున్నారన్న సునీల్ 
  • కొడాలి వంటి వ్యక్తి జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని విజ్ఞప్తి
  • బూతులు తిట్టి ఫేమస్ అయ్యాడని నానిపై ఆగ్రహం
గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు. తెలుగు వారికి ఎంతో ప్రముఖమైన సంక్రాంతి పండుగను కూడా ఆయన క్యాసినో, క్యాబరే డ్యాన్సులుగా మార్చేశారని ఆరోపించారు. గుడివాడ నియోజకవర్గం సమస్యలపై నిర్వహించిన బీజేపీ ఛార్జిషీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కొడాలి నాని వంటి వ్యక్తి జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బూతులు మాట్లాడి ఫేమస్ కావడం తప్ప అతను ఏం చేశాడని నిలదీశారు. ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల ఏపీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Kodali Nani
BJP
Sunil Deodhar

More Telugu News