Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్

Na Friendemo Pelli Private Song Released
Advertisement
  • నివృత్తి వైబ్స్ నుంచి మరో ప్రైవేట్ సాంగ్
  • ఇప్పుడు తెలంగాణ జానపద నేపథ్యంలో మరో పాట 
  • జయతిపై చిత్రీకరించిన హుషారైన బీట్ 
  • భీమ్స్ సంగీతంలో కాసర్ల శ్యామ్ సాహిత్యంలో ఆకట్టుకునే సాంగ్
Advertisement
అంద‌రితో శ‌భాష్ అనిపించేలా తెలుగు ఒరిజిన‌ల్ మ్యూజిక్‌ వీడియో సాంగ్స్‌ను ఆడియెన్స్‌కు అందిస్తోన్న సంస్థ నివృతి వైబ్స్‌. అత్యుత్త‌మ‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. గ‌డిచిన రెండేళ్ల‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వాటిలో 'జ‌రీ జ‌రీ పంచెక‌ట్టి' .. 'సిల‌క ముక్కుదానా' .. 'జంజీరే' .. 'వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి' వంటి పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి మ‌రో తెలంగాణ జాన‌ప‌ద పాట మ్యూజిక్ వీడియోగా మ‌న ముందుకు వ‌చ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. బుల్లి తెరపై 'వెన్నెల' ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్‌, ఇమేజ్‌ను ద‌క్కించుకున్న జ‌య‌తి, ఈ సాంగ్‌లో అద్భుత‌మైన హావ భావాల‌తో, మూమెంట్స్‌తో క‌ట్టిప‌డేసింది. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ పాట‌ల‌కు సంగీతాన్ని అందిస్తోన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యాన్ని అందించారు. శ్రావణ భార్గవి ఈ పాటకు ప్రాణం పోశారు. భాను మాస్ట‌ర్ సూప‌ర్బ్‌గా కొరియోగ్ర‌ఫీ చేశారు. లిరిసిస్ట్‌ కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. జ‌య‌తి విజ‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీకోనేటి ఈ పాట‌ను డైరెక్ట్ చేశారు. 
Advertisement
Advertisement
Jayathi
Bheems
Kasarla Shyam

More Telugu News