కర్ణాటక సీఎం అభ్యర్థిని రేపు బెంగళూరులో ప్రకటించనున్న ఖర్గే
- సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం నిర్ణయానికి రానున్న ఖర్గే
- ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న కాంగ్రెస్ వర్గాలు
- అందరి నుండి ఖర్గే సమాచారం సేకరిస్తారు
కర్ణాటక సీఎం పోస్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అధినేత అందరినీ కలిసి, వారి నుండి సమాచారం సేకరిస్తారని, ఆ తర్వాత రాహుల్, సోనియా గాంధీని కలిసి నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవచ్చునని, రేపు బెంగళూరులోనే ఖర్గే ప్రకటన చేస్తారని అంటున్నారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు ఖర్గేను వేర్వేరుగా కలిసిన విషయం తెలిసిందే.