భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 413 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్లు డౌన్
- స్వల్ప లాభాల్లో ముగిసిన బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్
- ఆటో సూచీలు డౌన్, పీఎస్‌యు బ్యాంకింగ్ అప్
హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్స్ గా నిలవగా; బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం నష్టపోగా, హెల్త్ కేర్, ఇన్ఫ్రా, బ్యాంకింగ్, మెటల్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ స్వల్పంగా లాభపడింది. ఇక, డాలర్ మారకంతో భారత కరెన్సీ రూపాయి 82.21వద్ద ముగిసింది. నిన్న ఇది 82.30 వద్ద ముగిసింది.