హైదరాబాద్-విజయవాడ మధ్య రేపటి నుండి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
- ప్రయాణికులకు అందుబాటులోకి పర్యావరణరహిత ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
- మంగళవారం నుండి అందుబాటులోకి 10 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
- అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో ఈ-గరుడ బస్సులు
హైదరాబాద్ - మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ బస్సుల ప్రారంభోత్సవం జరగనుందని, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఈ-గరుడ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, విజయవాడ రూట్లో ప్రతి 20 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండనుంది.