నేటి సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. సీఎంగా సిద్ధరామయ్య ఎన్నిక?
- కర్ణాటకలో నేటి సాయంత్రం 6 గంటలకు సీఎల్పీ సమావేశం
- పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సుర్జేవాల్ సమక్షంలో ఎమ్మెల్యేల సమావేశం
- సీఎం సీటు ఎవరికనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
- సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి అంటూ ప్రచారం
సిద్ధరామయ్యను సీఎం, డికే శివకుమార్‌ను డిప్యుటీ సీఎంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలను కలుపుకుపోయేలా డిప్యూటీ సీఎంల ఎంపిక ఉంటుందని అక్కడి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లింగాయత్, వక్కళిగ, దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కబోతున్నాయట. సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.