మెజారిటీ మార్కు అందుకోవడంలో విఫలమయ్యాం: బొమ్మై
- ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి
- పూర్తి ఫలితాలు వచ్చాక అంతర్మథనం చేసుకుంటామని వెల్లడి
- పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతో శ్రమించారన్న బొమ్మై
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ వర్కర్లు, నేతలు.. అందరమూ శాయశక్తులా పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని బొమ్మై చెప్పారు. అయితే, తాము అనుకున్నంతగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయామని తెలిపారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక పార్టీలో అంతర్మథనం చేసుకుంటామని వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని, ఇప్పుడు జరిగిన పొరపాట్లను దిద్దుకుంటామని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపడతామని బొమ్మై పేర్కొన్నారు.