కాచిగూడ- కాకినాడ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

Summer special trains between Kacheguda Kakinada Town
  • ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
  • ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లతో అందుబాటులోకి..
  • మరికొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించిన అధికారులు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ- కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పలు రైళ్లను వేసవి రద్దీ కారణంగా పొడిగించనున్నట్లు తెలిపింది. మే 13 (శనివారం)న రైలు నెంబర్ 07417 కాచిగూడ నుంచి రాత్రి 8:45 గంటలకు బయలుదేరి మే 14 (ఆదివారం) ఉదయం 8:40 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. 

రైలు నెంబర్ 07418 కాకినాడ టౌన్‌లో మే 14 (ఆదివారం) రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మే 15 (సోమవారం) ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ కోచ్ లతో పాటు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు. ఈ రైళ్లకు కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు..
హైదరాబాద్‌- తిరుపతి మధ్య ప్రతీ సోమవారం నడిచే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07643) ను జూన్ 26 వరకు, తిరుపతి- హైదరాబాద్ మధ్య ప్రతీ మంగళవారం నడిచే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07644) ను జూన్ 27 వరకు, తిరుపతి– సికింద్రాబాద్‌ మధ్య ప్రతీ ఆదివారం నడిచే ట్రైన్ (నెంబర్ 07481)ను జూన్‌ 25 వరకు, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రతీ సోమవారం నడిచే ట్రైన్ (నెంబర్ 07482)ను జూన్‌ 26 వరకు, హైదరాబాద్- నర్సాపూర్ మధ్య ప్రతీ శనివారం నడిచే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07631) ను జూన్‌ 24 వరకు పొడిగించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
spl trains
SCR
secunderabad
Indian Railways
summer specials

More Telugu News