జగిత్యాల ఎస్సై అనిల్ సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay on SI Anil suspension
  • విచారణ జరపకుండానే మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గి సస్పెండ్ చేశారన్న సంజయ్ 
  • పాతబస్తీలో పోలీసులపై దాడి చేస్తే ప్రభుత్వం స్పందించలేదని మండిపాటు
  • ఎస్సై సస్పెన్షన్ విడ్డూరమన్న బీజేపీ చీఫ్
జగిత్యాల ఎస్సై అనిల్ సస్పెన్షన్ ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం స్పందించారు. విచారణ జరపకుండానే మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. పాతబస్తీలో పోలీసులపై దాడి చేస్తే ఈ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. 

కానీ ఇప్పుడు ఓ ఎస్సైని మజ్లిస్ ఎమ్మెల్యేల ఒత్తిడితో సస్పెండ్ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయడంపై వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ రేపు జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Bandi Sanjay
si anil

More Telugu News