కేసీఆర్ ముఖ్య సలహాదారుగా బాధ్యతలను స్వీకరించిన సోమేశ్ కుమార్
- ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సోమేశ్ కుమార్
- తెలంగాణ సీఎస్ గా సుదీర్ఘ కాలం కొనసాగిన వైనం
- సోమేశ్ కుమార్ అనుభవానికి పెద్దపీట వేసిన కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే, ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ సోమేశ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.
దీంతో సోమేశ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. అయితే సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయనకు కేసీఆర్ తన ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలను అప్పగించారు.