ఎలాన్ మస్క్ చెబుతున్న కొత్త సీఈవో ఈమేనా?
- ట్విట్టర్‌ను గతేడాది సొంతం చేసుకున్న మస్క్
- మరో ఆరు వారాల్లో కొత్త సీఈవో వస్తున్నట్టు మస్క్ ట్వీట్
- ఆ కొత్తబాస్ లిండానేనంటూ వార్తలు
మస్క్ నిన్న ఓ ట్వీట్ చేస్తూ.. ట్విట్టర్‌కు కొత్త సీఈవోను నియమించినట్టు చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని, తాను సాఫ్ట్వేర్, సిసోప్లను పర్యవేక్షిస్తూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీవోగా మారుతానని పేర్కొన్నారు. మస్క్ ఇంత చెప్పినా ఆ కొత్త సీఈవో ఎవరన్న విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు. దీంతో రూమర్లు బయటకొచ్చాయి. ఆ కొత్త సీఈవో మరెవరో కాదని, లిండాయేనని జర్నలిస్ట్, సిలికాన్ వ్యాలీ ఇన్సైడర్ కారా స్విషర్ చెప్పుకొచ్చారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కూడా యకారియోనోనే ట్విట్టర్ తదుపరి సీఈవో అని పేర్కొంది.