కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • సోమేశ్ కుమార్ కు కేబినెట్ హోదా
  • మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న మాజీ అధికారి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యసలహాదారుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమేశ్ కుమార్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంగతి విదితమే. అయితే ఆయనను హైకోర్టు తీర్పు మేరకు ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించబడ్డారు.

Somesh Kumar
Telangana
KCR

More Telugu News