Ashwani Dutt: ఆ సినిమాతో కోట్లు వచ్చాయి .. మరో సినిమాతో అంతకంటే ఎక్కువ పోయాయి: అశ్వనీదత్

Ashwini Dutt Event
షార్ట్స్‌లో చూడండి
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఎన్నో భారీ సినిమాలను నిర్మించారు. స్టార్ హీరోలతో కలిసి భారీ విజయాలను అందుకున్నారు. ఆయన కూతుళ్లు నిర్మాతలుగా తాజాగా 'అన్నీ మంచి శకునములే' సినిమా నిర్మితమైంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో అశ్వనీదత్ మాట్లాడుతూ తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. మొదటి నుంచి కూడా నాకు రాఘవేంద్రరావుగారితో .. అల్లు అరవింద్ తో మంచి స్నేహం ఉంది. మా బ్యానర్ల నుంచి వచ్చిన భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మేము ముగ్గురం కూడా ఎన్నో సక్సెస్ లను చూశాము"అన్నారు.  

"నేను .. అల్లు అరవింద్ గారు కలిసి రాఘవేంద్రరావుగారితో 1996లో 'పెళ్లి సందడి' సినిమాను నిర్మించాము. కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన ఆ సినిమా, 14 కోట్లను వసూలు చేసింది. ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లం కూడా మేమే. మంచిగా లాభాలను పంచుకున్నాము" అన్నారు. 

"అన్ని కోట్ల రూపాయల లాభాలు వచ్చినప్పుడు కూడా మేము ఎగిరిపడలేదు. ఆ తరువాత నేను అల్లు అరవింద్ గారు కలిసి హిందీలో ఒక సినిమాను నిర్మించాము. అప్పుడు అంతకంటే ఎక్కువ పోయింది. అంతగా నష్టాలు వచ్చినా మేము కుంగిపోలేదు. మరో పెగ్గు ఎక్కువ తాగేసి ఎవరి దారిన వాళ్లం పోయాము' అంటూ నవ్వేశారు. 
Go Back to Shorts
Ashwani Dutt
Allu Aravind
Raghavendra Rao

More Telugu News