ధోనీపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం స్టాలిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం స్టాలిన్

CM Stalin praises MS Dhoni
  • తాను ధోనీకి అతిపెద్ద ఫ్యాన్ అని చెప్పిన స్టాలిన్
  • ధోనీ బ్యాటింగ్ చూసేందుకు ఇటీవల రెండు సార్లు స్టేడియంకు వెళ్లానని వెల్లడి
  • ధోనీ తమిళనాడు దత్తపుత్రుడని కితాబు
భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ధోనీ తమిళనాడు దత్తపుత్రుడు అని అన్నారు. తమిళనాడులో అందరి మాదిరే తాను కూడా ధోనీకి అతిపెద్ద ఫ్యాన్ నని చెప్పారు. ధోనీ బ్యాటింగ్ చూసేందుకు ఇటీవల తాను రెండు సార్లు చెపాక్ క్రికెట్ స్టేడియంకు వెళ్లానని తెలిపారు. సీఎస్కేకు ధోనీ ఇకపై కూడా ఆడతాడని తాను ఆశిస్తున్నానని చెప్పారు. 

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ధోనీ స్వయంకృషితో, పట్టుదలతో నేషనల్ ఐకాన్ గా ఎదిగాడని కొనియాడారు. తమిళనాడు ప్రభుత్వ క్రీడాశాఖ ఆధ్వర్యంలో 'తమిళనాడు ఛాంపియన్ షిప్ ఫౌండేషన్' మస్కట్ తో పాటు థీమ్ సాంగ్ ను స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధోనీ ఫౌండేషన్ లోగో, పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 
Advertisement
Stalin
DMK
MS Dhoni
CSK

More Telugu News