మరోసారి విశాఖ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- ఈ నెల 11న విశాఖకు వెళ్తున్న జగన్
- పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
- ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి హాజరవనున్న ముఖ్యమంత్రి
అనంతరం రామ్ నగర్ లోని వాణిజ్య సముదాయం, బీచ్ రోడ్ లోని సీ హారియర్ మ్యూజియం, ఎంవీపీ కాలనీలో ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను సీఎం ప్రారంభిస్తారు. భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, యెండాడలో కాపు భవన్ లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడు సాయి వివాహానికి హాజరవుతారు. రాత్రి 7 గంలకు విశాఖ నుంచి తిరుగుపయనమవుతారు.