కేటీఆర్ పేరు కూడా ఆంధ్రా నుంచి అరువు తెచ్చుకున్నాడు: రేవంత్ రెడ్డి
- కేటీఆర్ కు తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదన్న రేవంత్
- కేటీఆర్ కు సొంత ఊరు కూడా లేదని ఎద్దేవా
- చదివింది గుంటూరు విజ్ఞాన్ లో అని వెల్లడి
- నీ పేరే డ్రామారావు అంటూ కేటీఆర్ పై ధ్వజం
"ఆయనకు పేరు లేదు, సొంతంగా ఊరు లేదు... తెలంగాణలో చదువుకున్నది లేదు... తెలంగాణతో పేరు బంధం కానీ, పేగు బంధం కానీ లేదు" అని వివరించారు.
"నీ పేరే డ్రామారావు. ఆంధ్రా నుంచి అరువు తెచ్చుకున్నాడు. చదివింది గుంటూరు విజ్ఞాన్ లో. అంటే... దీన్ని బట్టి నీకు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి పాత్ర లేదు. నీ చదువు గుంటూరులో... నీ ఉద్యోగం అమెరికాలో. సిక్స్ పాయింట్ ఫార్ములా నుంచి చూస్తే 610 జీవో వరకు కేటీఆర్ కు ఇక్కడ ఏ హోదాలోనూ సాంకేతికంగా, నైతికంగా కొనసాగే అర్హత లేదు" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.