Balakrishna: మరోసారి ‘శివశంకరి’ పాట పాడిన బాలకృష్ణ.. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

balakrishna sings a song at doha event
షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఖతార్ లోని దోహాలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు ఎన్టీఆర్ తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ఫంక్షన్ లో బాలకృష్ణ పాట పాడి అందరినీ అలరించారు. ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా నుంచి ‘శివశంకరి’ పాటను ఆలపించారు. ఆయన పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అరుస్తూ, చప్పట్లు కొడుతూ తమ అభిమానాన్ని చాటారు. చివర్లో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిజానికి బాలయ్య గతంలో కూడా స్టేజీపై పాటలు పాడారు. హుద్ హుద్ వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు నిర్వహించిన కార్యక్రమంలో, చిత్ర పరిశ్రమ ఒక ఈవెంట్ నిర్వహించినప్పుడు, లేపాక్షి ఉత్సవాల్లో, ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్లోనూ పాడారు. ఇక మూడేళ్ల కిందట 2020లో అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ‘జగదేకవీరుని కథ’ సినిమాలోని ‘శివశంకరి.. శివానంద లహరి’ పాటను పాడి రిలీజ్ చేశారు. ‘పైసా వసూల్’ సినిమాలో ‘అరె మామా ఏక్ పెగ్ లా’ అనే పాట కూడా పాడారు.

Go Back to Shorts
Balakrishna
Nandamuri Taraka Rama Rao
NTR
Jagadekaveerudi Katha
Doha
shiva shankari

More Telugu News