ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్.. తొలి ఎంపీ టికెట్ ను ప్రకటించిన కేటీఆర్
- కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరును ప్రకటించిన కేటీఆర్
- హుస్నాబాద్ సభలో కేటీఆర్ కీలక ప్రకటన
- బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని ఓటర్లకు విన్నపం
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీపై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆయన విమర్శలు గుప్పించారు. నల్లధనం తెస్తామని చెప్పి తెల్లముఖం వేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ ఎవరని అడిగితే బండి సంజయ్ పేరు చెప్పాలంటే సిగ్గేస్తోందని అన్నారు. వినోద్ ను ఎంపీగా గెలిపించాలని.. బండి సంజయ్ ను ఇంటికి పంపించాలని అన్నారు.