ప్యాన్ వరల్డ్ తెలుగు సినిమా ‘హనుమాన్’ వాయిదా
- తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ చిత్రం
- ఈ నెల 12న విడుదల అవుతుందని చెప్పిన చిత్ర యూనిట్
- గ్రాఫిక్ వర్క్ ఆసల్యం కావడంతో వాయిదా పడినట్టు తాజా ప్రకటన
కానీ గ్రాఫిక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా వెనక్కు వెళ్లింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న అంచనాలను అందుకునేందుకు చిత్ర యూనిట్ మరింత ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నటి అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.