ఆయనకు నా మీద చాలా క్రష్ వుండేదనే విషయం మా స్కూల్ మొత్తానికి తెలుసు: క్రికెటర్ అశ్విన్ భార్య
- చిన్నప్పుడు ఇద్దరం ఒకే స్కూల్ కు వెళ్లేవాళ్లమన్న ప్రీతి
- ఏడో తరగతి నుంచే ఇద్దరం ఒకరికొకరు తెలుసని వెల్లడి
- క్రికెట్ గ్రౌండ్ కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పాడన్న ప్రీతి
తాను ఈవెంట్స్ కంపెనీలో పని చేసేదాన్నని ప్రీతి చెప్పారు. తనపై అశ్విన్ కు ఎంతో క్రష్ ఉండేదని... ఈ విషయం స్కూల్లో అందరికీ తెలుసని అన్నారు. క్రికెట్ కోసం అశ్విన్ స్కూళ్లు మారేవాడని, అయినప్పటికీ బర్త్ డేలు వంటి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు తాము కలుస్తుండేవాళ్లమని చెప్పారు. అశ్విన్ ఏదైనా సూటిగా మాట్లాడతాడని, ఒక రోజు క్రికెట్ గ్రౌండ్ కి తీసుకెళ్లి తన ప్రేమను వెల్లడించాడని... పెళ్లి చేసుకుందామని అడిగాడని తెలిపారు. అలా తమ పెళ్లి జరిగిపోయిందని చెప్పారు.