Nagachaitanya: 'కస్టడీ' కథ భలే కొత్తగా ఉందే .. రివీల్ చేసిన డైరెక్టర్!

  • వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న 'కస్టడీ'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న చైతూ 
  • ఆయన జోడీకట్టిన కృతి శెట్టి 
  • ఈ నెల 12న తెలుగు - తమిళ భాషల్లో రిలీజ్ 
Custody Movie Update

సాధారణంగా ఒక కథలో నాయకుడు - ప్రతినాయకుడు తప్పనిసరిగా ఉంటారు. హీరోయిన్ లేని కథలైనా ఉంటాయేమోగానీ, విలన్ లేని కథలంటూ దాదాపుగా ఉండవు. హీరో చేసే మంచి పనులకు అడుగడుగునా విలన్ అడ్డుపడుతూ ఉన్నప్పుడే, మజా ఉంటుంది. హీరోయిజం ఎలివేట్ అవుతూ ఉంటుంది. 

అవకాశం వస్తే చాలు హీరో -విలన్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు లేపేయాలనే పట్టుదలతోనే వ్యూహాలు పన్నుతూ వెళుతుంటారు. కానీ విలన్ బ్రతికుండాలి .. అతను చనిపోకుండా చూసుకోవలసిన బాధ్యత హీరోదే .. అలాంటి ఒక మెలిక ఉన్న కథ కచ్చితంగా కొత్తగానే ఉంటుంది. ఆ కథతో నడిచే సినిమానే 'కస్టడీ'. 

దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పినదాన్ని బట్టి, ఆయన తయారు చేసుకున్న ఈ కథ వినడానికైతే చాలా కొత్తగా ఉంది. ఇక తెరపై ఎలా పరుగులు తీయించాడనేది చూడాలి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో చైతూ నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మే 12వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

More Telugu News