Nagashourya: ఈ వారంలోనే సన్ నెక్స్ట్ లో 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి'

  • మరో ప్రేమకథగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
  • నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా రూపొందిన సినిమా 
  • మార్చి 17న థియేటర్స్ కి వచ్చిన సినిమా
  • ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ 
  • ఈ నెల 5వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్
Phalana Abbayi Phalana Ammayi Streaming Date Confirmed

నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' సినిమా తెరకెక్కింది. టైటిల్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమా ఇది. విశ్వప్రసాద్ - పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

మార్చి 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. సంజయ్ - అనుపమ ఇద్దరూ ప్రేమించుకుంటారు. సొంత ఊరు నుంచి మొదలైన వారి ప్రేమకథ, ఫారిన్ లోను కొనసాగుతుంది. అలకలు .. బుజ్జగింపులతో కథ రోటీన్ గా నడుస్తుంది. అందువల్లనే ఈ సినిమా ఆదరణ పొందలేకపోయింది. 

 దర్శకుడిగా అవసరాల తన మార్క్ను చూపించలేకపోయాడు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రావడానికి రెడీ అవుతోంది. సన్ నెక్స్ట్ వారు ఈ సినిమాను ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News