యువ కొరియోగ్రాఫర్ ఆత్మహత్యపై నటి శ్రద్ధా దాస్ స్పందన

  • ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చైతన్య
  • నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్య
  • అప్పుల భారం పెరిగిపోయిందంటూ సెల్ఫీ వీడియో
  • చైతన్య ఎంతో మంచివాడన్న శ్రద్ధా దాస్
ఎంతో ప్రజాదరణ ఉన్న డ్యాన్స్ కార్యక్రమం ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. చైతన్య బలవన్మరణం వినోద రంగంలో విషాదాన్ని నింపింది. అప్పులు బాగా పెరిగిపోవడంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ అతడు నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్య ఆత్మహత్యపై నటి శ్రద్ధా దాస్ స్పందించారు. 

చైతన్య మాస్టర్ ఎంతో మంచివాడని, అతడిది గొప్ప మనసు అని తెలిపారు. మీరు నవ్వుతూ, అందరినీ నవ్వించేవాళ్లు మాస్టర్... కానీ ఇవాళ మీరు నన్ను చాలా ఏడిపించారు. మీ నవ్వును మర్చిపోలేను అంటూ శ్రద్ధా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

పుట్టడం, చనిపోవడం ఎప్పుడు, ఎందుకు జరుగుతాయో తెలియవని, కానీ ఆ రెండింటి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మన గొప్పతనాన్ని నిర్ణయిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Sraddha Das
Chaitanya
Suicide
Choreographer
Dhee Show

More Telugu News