ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు... ఐఎండీ అలర్ట్
- మే 1, 2 తేదీల్లో పలు జిల్లాలకు వర్ష సూచన
- గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు
- ఇప్పటికే వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో బెంబేలెత్తుతున్న రైతాంగం
మే 2వ తేదీన మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి జిల్లా, కృష్ణా, ఏలూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.