ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం

  • బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరాము
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవను తప్పించిన ప్రభుత్వం
  • ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవ నియామకం
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరాము నియమితులయ్యారు. అనంతరాముకు అదనంగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ విభాగం విధులు కూడా కేటాయించారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి.జయలక్ష్మిని నియమించారు. 

ఇక, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవను తప్పించారు. ఆయనను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. క్రీడలు, సాంస్కృతిక శాఖ బాధ్యతలను కూడా రజత్ భార్గవ నిర్వర్తించనున్నారు. 

మైనారిటీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ గా జి.లక్ష్మీషాకు పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు

IAS
Officials
Transfers
Andhra Pradesh

More Telugu News